పల్లవి:
ముసలమ్మ ముచ్చట్లు కట్టిపెట్టి
పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టి ]
దీక్షతో నడుముకట్టి ఇంటింటి తలుపుతట్టి
యేసయ్య ఊసే చెప్పమ్మా - ఊరకనే ఉంటే తప్పమ్మా ॥ము॥
1. ఆ ఇంటి సంగతులన్నీ ఈ ఇంటికి మోసేవమ్మా
పొరుగింటి విషయాలన్నీ చాటింపు వేసేవమ్మా
ఇక్కడ మాటలు అక్కడ చెప్పి మంచిని చెడుగా తిప్పి
రెచ్చగొట్టే పనులే మానమ్మా చిచ్చుబెట్టబాకే చిన్నమ్మా ॥ము॥
2. కల్పించిన కథలంటే చెవి కోసుకుంటావమ్మా
చెడు మాటల సభలంటే నువ్వే ముందుంటావమ్మా
విన్నదానికి కొసరు వేసి - ఉన్నదాన్ని మార్చేసి
3. మంచిగ ఉన్నోళ్ళని చూస్తే కళ్ళెర్ర జేస్తావమ్మా
హెచ్చింపబడుతూ ఉంటే అపనిందలు వేస్తావమ్మా
వ్యంగ్యపు మాటలు కత్తులు దూసి చల్లగ గుండెను కోసి
