కీర్తనలు

757. క్రైస్తవుని తీర్మానము

రచయిత: ఎ. ఆర్. స్టీవెన్సన్

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
నీ నీడలో నా బ్రతుకు గడవాలని నీ అడుగుజాడలలో నే నడవాలని నీ సహాయము కోరుకుంటిని
1.  నీయందు నిలిచి ఫలించాలని ఈ లోక ఆశలు జయించాలని నీ ప్రేమ నాలో చూపించాలని నా పొరుగువారిని ప్రేమించాలని ॥హృదయవాంఛను||
2.  నీ సేవలో నే తరించాలని నీకై శ్రమలను భరించాలని విశ్వాస పరుగు ముగించాలని జీవకిరీటము ధరించాలని ॥ హృదయవాంఛను||
3.  నీ రూపు నాలో కనిపించాలని నా అహమంతా నశియించాలని నీ వార్త ఇలలో ప్రకటించాలని నీ కడకు ఆత్మల నడిపించాలని ||హృదయ॥