కీర్తనలు

756. అశాశ్వతమైన లోకము!

రచయిత: ఎ. ఆర్. స్టీవెన్సన్

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరివంటిది. ఈ జీవితం - లోకానకాదేదీ శాశ్వతం మరణమైన జీవమైన - నిన్ను విడువడు
1.  ఎదురౌతారెందరో నీ పయనంలో నిలిచేది ఎందరు నీ అక్కరలో వచ్చేదెవరు నీతో మరణమువరకు ఇచ్చేదెవరు ఆపై నిత్యజీవము నీకు ॥యేసే నిజ॥
2.  చెమటోడ్చి సుఖము విడిచి కష్టములోర్చి ఆస్తులు సంపాదించిన శాంతి ఉన్నదా ఈ రాత్రే దేవుడు నీ ప్రాణమడిగితే సంపాదన ఎవరిదగునో యోచించితివా || యేసే నిజ||
3.  నీ శాపం తాను మోసి పాపం తీసి రక్షణ భాగ్యం నీకై సిద్ధము చేసి విశ్రాంతి నీయగా నిన్ను పిలువగా నిర్లక్ష్యము చేసిన తప్పించుకొందువా ॥యేసే నిజ॥