← కీర్తనలు

755. విడువని దేవుడు!

రచయిత: ఎ. ఆర్. స్టీవెన్సన్

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నను విడువడు అడుగులు తడబడినా - అలసట పైబడినా చేయిపట్టి వెన్నుతట్టి - చక్కని ఆలోచన చెప్పి ॥నడిపి||
1.  అంధకారమే దారి మూసినా - నిందలే నను కృంగదీసినా తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యంవరకు నను చేర్చుతాడు ॥న॥
2.  కష్టాల కొలిమి కాల్చివేసినా- శోకాలు గుండెను చీల్చివేసినా తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యంవరకు నను చేర్చుతాడు ॥న॥
3.  నాకున్న కలిమి కరిగిపోయినా నా యొక్క బలిమి తరిగిపోయినా తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యంవరకు నను చేర్చుతాడు ॥న॥