పల్లవి:
ఎంతటివాడను నేను యేసయ్యా - కొంతైనా యోగ్యుడను కానయ్యా
ఇంతగ నను హెచ్చించుటకు - ఈ స్థితిలో నన్నుంచుటకు ॥
1. ఐశ్వర్యము గొప్పతనమును - కలిగించు దేవుడ వీవే
హెచ్చించువాడవును - బలమిచ్చువాడవు నీవే
అల్పుడను మంటిపురుగును - నన్ను ప్రేమించినావు
ప్రాణమును నీ సర్వమును - నా కొరకై అర్పించినావు ||ఎంతటి||
2. నిను వెంబడించువారిని - నిజముగ సేవించువారిని
నీవుండే స్థలములలో - నిలిచే నీ సేవకుని
ఎంతో ఘనపరచెదవు - ఆశీర్వదించెదవు
శత్రువులకంటె ఎత్తుగా - అతని తలను పైకెత్తెదవు || ఎంతటి||
3. వినయముగల మనుష్యులను వర్ధిల్లజేసెదవు
గర్విష్టుల గర్వమునణచి - గద్దెనుండి దించెదవు
మాదు ఆశ్రయ దుర్గమా - మేమంతా నీవారమే
మా శైలము మా కేడెమా - మాకున్నదంతా నీ దానమే ||ఎంతటి||
