కీర్తనలు

753. తప్పిపోయిన కుమారునికి పిలుపు

రచయిత: ఎ. ఆర్. స్టీవెన్సన్

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
చాచిన చేతులతో ఎదురు చూచుచుండెను వేచిన నీ తండ్రి కనులు నిదుర ఎరుగక యుండెను నీ తండ్రి ప్రేమను గనవా - నీ యింటికే తిరిగి రావా
1.  పనివారు సయితం నీ తండ్రి ఇంట రుచియైన అన్నం తినుచుండగా శుచిలేని పొట్టుకై ఆశింతువా ॥ఓ చిన్నితనయా॥
2.  నీ క్షేమమును కోరు నీ తండ్రి నొదిలి ఆ క్షామ దేశమున జీవింతువా విస్తార ఆస్తిపై అధికారమును విడిచి కష్టాల బాటలో పయనింతువా ||ఓ చిన్నితనయా॥
3.  పరిశుద్ధ తండ్రికి ప్రియ సుతునివై యుండి పందులతో నీకు సహవాసమా ఏర్పరచబడిన యువరాజువై యుండి పనికిమాలిన వారితో స్నేహమా ॥ఓ చిన్నితనయా॥