కీర్తనలు

752. సంతోషకరమైన కాపురం!

రచయిత: ఎ. ఆర్. స్టీవెన్సన్

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
మమతాను రాగాలే మాలలుగా - సమతాను బంధాలే ఎల్లలుగా కట్టబడిన కాపురం - అనురాగ గోపురం ఈ పరిణయం - యెహోవా నిర్ణయం |॥మమతాను||
1.  వరుడైన క్రీస్తు వధువైన సంఘమును ఎంతగానో ప్రేమించి ప్రాణమునే అర్పించె భార్యను ప్రేమించవలెనని యేసయ్య ఏర్పరచినది ॥మమతాను ||
2.  కుమారుడు క్రీస్తు శిరస్సైన తండ్రికి అన్నివేళలందు విధేయత చూపె అన్నిటిలో విధేయురాలిగ ఉండునట్లు ఏర్పరచినది ॥మమతాను ||