← కీర్తనలు

751. గొట్టెపిల్ల వివాహోత్సవము

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
గొట్టెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చెను ... రండి
1.  సర్వాధికారియు - సర్వోన్నతుండైన మన తండ్రిని ఘనపరచి - మనముత్సహించెదము ||గొఱ్ఱపిల్ల||
2.  సిద్ధపడెను వధువు - సుప్రకాశముగల నిర్మల వస్త్రములతో - నలంకరించుకొనెన్ ॥గొఱ్ఱపిల్ల॥
3.  పరిశుద్ధుల నీతి - క్రియలే యా వస్త్రములు గొర్రెపిల్ల రక్తములో - శుద్ధి నొందినవారు ॥గొఱ్ఱపిల్ల||
4.  తెల్లని గుర్రముపై కూర్చుండినవాడు నమ్మకమై యున్నట్టి - పెండ్లి కుమారుండు ॥గొఱ్ఱపిల్ల||
5.  దేవుని వాక్యమను - నామము గలవాడు రక్తములో ముంచిన – వస్త్రమున్ ధరియించె ॥గొట్టెపిల్ల॥
6.  పరలోక సేనలు - తెల్ల వస్త్రములతో తెల్ల గుర్రములెక్కి - వెంబడింతురు ప్రభుని ॥గొఱ్ఱపిల్ల॥
7.  ప్రేమించి సంఘముకై - ప్రాణంబునిదె ప్రభువు పరిశుద్ధపరచుట కొరకై - తానప్పగించుకొనెన్ ॥గొర్రెపిల్ల||
8.  శ్రీ యేసు క్రీస్తుండె - సంఘంబునకు శిరస్సు వాక్య ఉదకముతోడ - శుద్ధిపరచుచుండె ॥గొట్టెపిల్ల||
9.  యెహోవా రాజ్యములో - భూలోకవాసులు సంతోష హృదయములతో తేజరిల్లుదురు ||గొఱ్ఱపిల్ల||
10.  దేవా ఈ కార్యమును – నెరవేర్చితివి నీవే నిత్యమును నీ మహిమ - పాడెదం హల్లెలూయా ॥గొఱ్ఱపిల్ల॥