← కీర్తనలు

750. వివాహ పవిత్రత

రచయిత: ఎ. ఆర్. స్టీవెన్సన్

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
వివాహమన్నది పవిత్రమైనది ఘనుడైన దేవుడు ఏర్పరచినది
1.  ఎముకలలో ఒక ఎముకగా - దేహములో సగ భాగముగా నారిగా సహకారిగా - స్త్రీని నిర్మించినాడు దేవుడు ॥వివాహ॥
2.  ఒంటరిగా ఉండరాదని జంటగా ఉండ మేలని శిరస్సుగా నిలవాలని - పురుషుని నియమించినాడు దేవుడు ॥
3.  దేవునికి అతి ప్రియులుగా - ఫలములతో వృద్ధి పొందగా వేరుగానున్న వారిని - ఒకటిగ ఇల చేసినాడు దేవుడు ॥వివాహ॥