పల్లవి:
కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం
1. ఏదెను వనమున యెహోవా దేవ మొదటి వివాహము చేసితివే
ఈ శుభ దినమున నవ దంపతులను నీ దీవెనలతో నింపుమయా ॥
2. కానా విందులో అక్కర నెరిగి నీళ్ళను రసముగ మార్చితివే
కష్టములలో నీవే అండగనుండి కొరతలు తీర్చి నడుపుమయా దే॥
3. బుద్ధియు జ్ఞానము సంపదలన్నియు గుప్తమైయున్నవి నీ యందే
ఇహపరసుఖములు మెండుగ నొసగి ఇల వర్ధిల్లగజేయుమయా
