కీర్తనలు

747. క్రీస్తు శ్రమలు

రచయిత: ఎ. ఆర్. స్టీవెన్సన్

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
గెత్సేమనే తోటలో క్రీస్తేసు వేదన మానవాళి విడుదల కొరకైన ప్రార్థన ఆ మరణ పాత్ర మన పాప ఫలితమే
1.  ఘోరమైన శ్రమలెన్నో పొందాలని కలువరి వరకు సిలువ మోయాలని ఎరిగియుండి ఆ పాత్రను స్వీకరించెను తన తండ్రి చిత్తమునకు తలవంచెను ॥నీ కోసమే॥
2.  కొంచెమైన మంచితనము లేని పాపిని సంపూర్ణ స్వస్థతతో నింపాలని గాయములు పొందుటకు సిద్ధమాయెను తన తండ్రి చిత్తమునకు తలవంచెను ॥నీ కోసమే॥
3.  క్షయమగు మనిషిని మహిమకు మార్చాలని అక్షయమగు రాజ్యములో చేర్చాలని మరణంపు ద్వారమున ప్రవేశించెను తన తండ్రి చిత్తమునకు తలవంచెను |॥నీ॥