← కీర్తనలు

746. దైవస్తుతి

రచయిత: ఎ. ఆర్. స్టీవెన్సన్

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
యెహోవా నిన్ను పోలియున్న వారెవ్వరు యేసువా నీకు సాటియైన వారెవ్వరు ||యెహోవ||
1.  సృష్టికి ఆధారుడా అద్వితీయుడా నిత్యము నివసించుచున్న సత్యదేవుడా అందరిలో సుందరుడా కాంక్షనీయుడా వందనములకర్హుడా పూజ్యనీయుడా ॥యెహోవా॥
2.  పాపికొరకు ప్రాణమిడిన ప్రేమరూపుడా లోక శాపమును మోసిన సిలువధారుడా మరణపు కోరలు పీకిన విజయవీరుడా శరణన్నచో కరుణచూపు పరంధాముడా ॥ యెహోవా॥
3.  ఆదియు అంతములేని అగ్నినేత్రుడా ఆదరించు నాధుడా స్తుతికి పాత్రుడా కన్యక కడుపున బుట్టిన పరమపుత్రుడా అన్యజనుల జతకట్టిన మంచి మిత్రుడా ॥యెహోవా॥