← కీర్తనలు

743. Search me O God and know - సమర్పణ

రచయిత: ఎడ్విన్ ఓర్

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
ఓ దేవా, నా మదిన్ పరీక్షించు కూర్చుము రక్షకా నా తలంపులన్ తీసివేయుము అసత్య మార్గమున్ పాపంబు త్రోసియే విమోచింపుము
1.  స్తోత్రింతు నిన్ - పాపంబు పోయెను వాక్యానుసారమే - పవిత్ర పరచుము పాపమోర్చిన ఆ యగ్నితో నింపు నీ మహిమ జూడయే నా కోర్కె దీర్చుము
2.  తీసికొను ప్రభూ - నా జీవితంబును నింపు నీ దివ్యమౌ ప్రేమతో మదిన్ తీసివేయుము దుర్మర్గమౌ గుణం నాలోనే యుండుము సమర్పింతును ప్రోత్సహించుము జీవింపజేయుము అంతరాత్మను నా రక్షకా నా యాశల్ దీర్చుమా నే గోరుదు నీ యాశీర్వాదంబును
గానం సూచన
అనువాదం: రెవ. డా॥ జేకబ్ ప్రభు మూల పాఠ్యంలో ప్రత్యేక పల్లవి గుర్తు లేకపోవడంతో మొదటి చరణం పల్లవిగా అమర్చబడింది.