← కీర్తనలు

742. The Old Rugged Cross - సిలువ విలువ

రచయిత: జార్జ్ బెన్నార్డ్

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
ఆ పురాతన సిలువన్ నే హత్తుకొందున్ జయచిహ్నముల్ వదలుకొనుచున్ గరుకైన సిలువన్ నే పట్టుకొనియే కిరీటమున్ నే పొందుదున్
1.  దూరమౌ కొండపై గరుకైన సిలువన్ శ్రమావమానపు గుర్తులే పాత సిలువన్ ప్రేమింతున్ హతమాయె దానిపై పాపులందరి ప్రియుండేసు
2.  లోకమే త్యజించిన గరుకైన సిలువ నన్నెంతయో ఆకర్షించెన్ విడిచెనే మహిమన్ దేవగొట్టె భువిని భరియింపనే కల్వరిపై
3.  దైవరక్తమయమౌ గరుకైన సిలువ బహు సుందర దృశ్యమదియే దానిపై శ్రమతో చావొందెనేను నన్ క్షమించుచు శుద్ధిచేయన్
4.  నింద, బాధ భరింతున్ గరుకైన సిలువన్ యథార్థతతో భక్తితో దూరమౌ నా గృహమున్ చేర్చుదినం వచ్చుగా నిత్యమహిమలో నుండుటకే
గానం సూచన
అనువాదం: రెవ. డా॥ జేకబ్ ప్రభు