← కీర్తనలు

740. రక్షణానందము

రచయిత: రెవ. డా॥ జేకబ్ ప్రభు

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
స్వరమెత్తి పాడెదము - పరమాత్ముని చూపెదము ధరలోన యేసుని ప్రేమన్- నిరతంబు చాటెదము ||స్వర||
1.  సృజియించెను మానవులన్ భజియింపుమని కోరెన్ త్యజియించుచు పాపమునంతయు విజయంబును పరమునకై ||స్వర||
2.  మనయందరి పాపముకై - చనిపోయెన్ సిలువమీద ఘనముగ లేచెను యా చావునుండి- కొని తెచ్చెను రక్షణను ||స్వర||
3.  సమర్పింతుము జీవితముల్- క్షమియించెను పాపమును సమర్పించెను నూతన జీవమున్ సమకూర్చెను సంతోషమున్ ||స్వర||