కీర్తనలు

739. క్రైస్తవ సంఘసాక్ష్యము

రచయిత: రెవ. డా॥ జేకబ్ ప్రభు

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
జీవ దేవుని ప్రతినిధులం - జీవవాక్యపు సాక్షులము దైవసత్య మూలము సంఘం - జీవితములను మార్చు సమాజం ॥
1.  సంఘపు శిరస్సు క్రీస్తే సంఘ నిరీక్షణ తానే సంఘవనరు ప్రార్థినయే - సంఘము చూడదు ఓటమినే ॥జీవ॥
2.  సహవాసము అతిశ్రేష్టం సహింతుము భారములన్ని సహచరులము దాసులమే మహిమను తెచ్చెదం క్రీస్తునకే ॥జీవ॥
3.  దేవునికొరకే వెళ్లుదుం చావును మరచుచు నెదలో తావును మార్చుచు జగతిన్ సేవను నిజముగ జేయుదుము ॥జీవ॥
4.  క్రమశిక్షణ పాటింతుం - శ్రమలను లక్ష్యము చేయం భ్రమలను వీడుచు భువినే క్రమముగా ఆరాధించెదము ॥జీవ॥
5.  5. ఎత్తబడును మన సంఘం పొత్తుండదు లోకముతో ప్రత్యక్ష విశ్వాసులం – ప్రతిష్ఠ కలిగిన పరివారం ॥జీవ॥
6.  మెరుగైన విశ్వాసులం - ఎరుగుదుం ప్రతియొక్కరిని ఎరుగని వారికి చెప్పుచు - పరులను చేర్చుదుం సంఘములో ॥జీవ॥