← కీర్తనలు

738. యేసుక్రీస్తునకు స్తుతి

రచయిత: రెవ. డా॥ జేకబ్ ప్రభు

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
ప్రేమ స్వరూపియౌ క్రీస్తు - నామమున్ స్తుతింతుము క్షేమకరమౌ జీవితమును - ప్రేమతోడ దయచేయును ॥ప్రేమ॥
1.  మా యంధకారమునంత వెలిగించెను - మా యడుగులన్నింటిని తప్పించెను - గాయంబు నంతయు మాన్పివేసెన్ || ప్రేమ స్వరూపి॥
2.  పాపంబులన్నింటిని తుడిచె తానే - ఆపదల సమూహమును తొలగించెను - తాపంబు బాపియే రక్షించెను ॥ప్రేమ స్వరూపి॥
3.  3. సంతోష సమాధానంబుల నిచ్చెను - వింతైన స్థితి గతులన్ని యేర్పరచెను - చెంతనే చేరియే కీర్తింతుము ॥ప్రేమ స్వరూపి||
4.  జీవిత శోధనలన్ని మాయమగును - జీవముగల యేసుని ముఖమున్ గనిన - జీవిత పోరాటమున్ గెల్తుము ॥ప్రేమ స్వరూపి॥
5.  యేసుని చిత్తమే మా శాంతిమార్గం- యేసేను మా హృదయంబు కోరిక నేడు – యేసుని నామంబున్ ధరియింతుము ॥ప్రేమ స్వరూపి॥
6.  ఆదియును అంతమును క్రీస్తుయేసే - మోదంబుతోనిచ్చును జీవజలమున్ - ఆదుకొందుము నేడు నిజదేవుని ॥ప్రేమ స్వరూపి॥
7.  పాపముల దోషము తెచ్చు ఘోరమరణం - కాపరియౌ క్రీస్తు నిడును నిత్యజీవం – ఓపికతో పాపమును వీడుదుము ॥ప్రేమ స్వరూపి॥
8.  బూరధ్వని మ్రోగుటతో క్రీస్తు వచ్చున్ భారంబున్ తొలగింపను వచ్చునెపుడో - వీరుండే క్రీస్తుతో నివసింతుము ॥ప్రేమ స్వరూపి॥