← కీర్తనలు

737. క్రైస్తవుని సమర్పణ

రచయిత: రెవ. డా॥ జేకబ్ ప్రభు

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
ఓ రక్షకా నిన్నే ప్రేమింతున్ కోరుదున్ నీ సన్నిధిన్ ఎన్నడెన్నడున్ ॥ఓ రక్షకా॥
1.  నీయాధీనంబునందుంచు నా తలంపులన్ నీ వశంబునందే యుంచు శక్తియంతయున్ నీ చిత్తమున్ జరిగింపనే త్రిప్పుము నా మనసున్ ||ఓ రక్షకా||
2.  నా హస్తము లివిగో కొనుము నీ సేవకై నా పాదముల నడిపించుము నీ కార్యసఫలతకై నా నేత్రము లమర్చుము నీ సౌందర్యమునన్ ॥ఓ రక్షకా॥
3.  అన్నివేళల నిన్నే యారాధింతు భువినే అంధకారమందును ప్రకాశమందును అరుణోదయమే ఎల్లకాలము నీతోనుండగా ॥ఓ రక్షకా॥