కీర్తనలు

736. క్రైస్తవ సాక్ష్యము

రచయిత: రెవ. డా॥ జేకబ్ ప్రభు

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
అనుసరించెదను యేసుని అన్నివేళలను మనసు నిలిపెదను వదలక ఎట్టి స్థితినైన ॥అనుసరించెదను||
1.  ఆత్మ విషయముపై అసలు చింత త్రోసితిని భౌతికాసక్తిన్ హృదిని హెచ్చు చేసితిని శాంతిన్ వీడితినే కాని అన్ని పొందితిని నీతిన్ కనుగొంటిన్ కావున అన్ని వీడితిని ॥అనుసరించెదను ||
2.  ఆత్మ విషయములే ఎంతో ప్రోత్సహించినవి ప్రీతికరమాయెన్ ఘనమౌ జీవమార్గంబే సత్యవాక్యమునే అనుదినం ఆలకించెదను నిత్యజీవమునే నిత్యము అనుభవించెదను ॥ అనుసరించెదను ||
3.  3. ఆత్మ జీవితమే నేడు శాంతి నొసగినది ప్రాతఃకాలములన్ ధ్యానం ప్రారంభించితిని భీతిన్ వీడితినే పూర్తిగా హాయిన్ పొందితిని గోతిన్ వదలితినే శ్రేష్టమౌ పరమున్ చేరితినే ॥ అనుసరించెదను॥