← కీర్తనలు

735. రక్షణానందము

రచయిత: రెవ. డా॥ జేకబ్ ప్రభు

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
ప్రభుయేసు రక్షకుడు - ప్రతి పాపిని ప్రేమించున్ ప్రతి మదిని వెలిగించున్ ॥ప్రభు||
1.  నా ఘోరపాపములన్ని నా దేవుని దూరము జేసెన్ నాధుని వీడితినే ॥ప్రభు యేసు||
2.  పాపములే మరణము గూర్చెన్ - పాపమునకే తీర్పు వచ్చెన్ పాపపు నరకమహా ॥ప్రభు యేసు॥
3.  నా కొరకై త్యాగము చేసెన్ నా శిక్షను తానే భరించెన్ నా సిలువెక్కెనహా ॥ప్రభుయేసు||
4.  మరణించి సమాధియాయె మరి లేచి సజీవుడాయెన్ మరణము గెలిచెనహా ॥ప్రభుయేసు||
5.  నమ్మితినే జీవసువార్తన్ - నమ్మిననే జీవము దొరికెన్ నిత్యమౌ జీ ... వమే ||ప్రభుయేసు|