← కీర్తనలు

731. నీ నీడలో - బ్రతుకు సాగాలని

రాగం: భాగేశ్వరి|తాళం: ఆది|రచయిత: రెవ. బి. హెన్రీ

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
నీ నీడలో – బ్రతుకు సాగాలని నీ బాటలో – నేను – నడవాలని ప్రభూ – నా జీవితాశ – నెరవేరునా నెరవేరునా
1.  మతిలేక బ్రతికాను గతిలేని బ్రతుకు క్షతిలారని వెతలన్ని – సంప్రాప్తమాయె హితమైన నీ వాక్య – భోజ్యంబులోనే
2.  బాంధవ్యమనులోక – బంధాలలోనే బందీగ ఉన్నాను – పొందాను వ్యధను బలియైన అలనాటి – నీ ప్రేమ జూచి బరువాయె మనసంత – శరణంటి నిన్ను ॥నీ నీడలో॥
3.  కన్నాను నీప్రేమ – కల్వరిలోనే విన్నాను నీ బోధ – వేదంబులోనే నన్నాదుకొనువారు – విశ్వాన లేరు ఉన్నావు నీవే – విమోచింప నన్ను ॥నీ నీడలో॥