← కీర్తనలు

730. పాపి పశ్చాత్తాపము

ఛాయ: ఓ దేవ నేను నీ దాపున|రచయిత: రెవ. జి. టి. మార్కు.

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
శ్రీయేసు నీ పాద – సేవ చేయుట శ్రీయేసు నీ పాద – సేవ చేయుట ఎంతో శ్రేయంబు చేకూర్చును నా యేసు నీ పాద సేవ చేయుటచే నా ఆయాసములన్నియు – అంతరించును ప్రభువా ||శ్రీ యేసు||
1.  ఘోర పాపిని నేను – నేరంబులను చేసి దారి తప్పిన ద్రోహిని – కారుణ్యమయుడవే కరుణించి కాపాడి – దారిలో నన్నుంచి దరి చేర్చుము తండ్రి ||శ్రీ యేసు||
2.  దోసకారిని నేను దోసంబులజేసి దోసిలొగ్గితి ప్రభువా – దాసుండనో యేసు నాధా నీదయచేత – దోసంబులనుబాప దాసునిగ జే కొనుము ||శ్రీ యేసు||
3.  సాతాను శక్తులను సంధించి జయమొంది సంతరిల్లిన యేసువా – నీతోనే నేనుండి నిన్నే సేవించెద – సాతాను నోడింప శక్తి నియ్యుము ప్రభువా ||శ్రీ యేసు||
4.  అలనాడు శిష్యులను ఆదరించియు నెంతో అభయమిచ్చిన యేసువా ఇల నే దీనుడనయ్య అలముకొని యున్నట్టి – కలుష భారములెల్ల తొలగజేయుము తండ్రి ||శ్రీ యేసు||
5.  నాదు జీవితమెల్ల – నీదు సేవకే నేను ధారవోయిదు నా ప్రభువా నాధా నారక్షకా నా సర్వస్వము నీవే నీ పాద సేవయే నా జీవితాశయము ||శ్రీ యేసు||
6.  నీ కొరకే జీవించి – నిన్ను సేవించుచు నీకొరకే మరణింతును – నీకే నా యాత్మను నిజమొప్పనర్పించి నీ సన్నిధిలో నేను నిత్యముందును ప్రభువా ||శ్రీ యేసు||
7.  ఇదియే నా తుదియాశ – ఇదియే నా తుది కోర్కె ఇదియే నా తుది ఆశయము – హృదయంబు నీ కిత్తు పదిలంబుగ నేను – సదయుండా నిరతంబు అందే నివసింపుము ||శ్రీ యేసు||