కీర్తనలు

729. యవ్వన సమాజము సవాలు

ఛాయ: రాజాధి రాజ రారా|రచయిత: బోండ్ల సైరన్

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
రారండి – యువతి యువకులారా రారండి – యువతి యువకులారా – లేలెండి. సిలువదారిపోవ = రారాజు యేసు రాజు రాజ్యం రయముగాను – వచ్చునంచు చాట ॥రారండి॥
1.  ఓ ………… మారుతున్న నేటి సమాజంబులో – ఓ … మారనట్టి యేసు శక్తి చూపను = మారుమనస్సు పొంది నీవు వేగ – మార్గ దర్శి యేసు దారిపోవ – మానవాళి మనస్సు వెల్ల మార్చి మంచి సమాజంబును నిర్మింపన్ ॥రారండి॥
2.  ఓ……… ప్రేమ లేని నేటి సంఘజీవికి – ఓ …. ప్రేమమూర్తి – యేసు -ప్రేమ జూపుచు = ప్రేమ శ్రేష్టమైనదంచు చాటి – ప్రేమ దారి యెల్లరకును జూపి- ప్రేమధార గ్రోలి నీవువేగ ప్రేమధార గ్రోలుడంచు చాట ॥రారండి॥
3.  ఓ……. రక్షణంపు – మార్గమేమో తెలియక ఓ ……. పాప రోగగ్రస్తులైన- పాపులన్ = పరమ వైద్యు డేసు చెంతకేగ – పాప రోగమెల్ల పోవునంచు చెప్పి నీవు – ముక్తి దారి చూపవేగరండి భక్తితోడ చాటి ॥రారండి॥
4.  ఓ…….. శాంతి – క్రాంతి లేని – లోకవాసికి – ఓ శాంతి – క్రాంతి యేసే నంచు – చాటుచు = భ్రాంతిలోకమందు ప్రీతి వీడ -విశ్రాంతి నిచ్చు విశ్వనాధుడంచు క్రాంతి హృదయమందు నింపి నీవు నిశాంతమందు – తుదకు జేరవేగ ॥రారండి॥
5.  ఓ…….. నూతన – శతాబ్దం- నడుగుపెట్టిన- ఓ ….. నవత – యువత నూతనోత్సవంబుతో – దివ్యయేసు రక్షణంపు వార్తన్ – నవ్యపద్దతులతో-నీవు చాటన్ – నిదురబోవు లోక వాసులెల్లన్ నిదురలేపి మేలుకొలుపు పాడన్ ॥రారండి॥