కీర్తనలు

728. షష్టి పూర్తి ఉత్సవము

రాగం: బిలహరి|తాళం: త్రిపుట|ఛాయ: దేవ సంస్తుతి చేయవే మనసా

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
సృష్టి కరతా – స్తోత్రములుఁ జేతు ఈ షష్ఠివత్సర పర్వదినమునఁ జేరి పూజింతుఁ = సృష్టములతో ఈ మానవుని సృజనాశక్తితో – నీవే సృజియించి లొసగితివి నీ కృపల దలచుచు॥సృష్టి॥ నీ స్వరూపము – నీ పోలికతో నీ సృష్టిపయిన పాలన అభివృద్ధి ||సృష్టి||
1.  గర్భవాసిని యయినది మొదలు గర్భమందే – నన్ను యెరిగితివి జేసితివి – నీ కృపల దలచుచు గర్భమందు -పెంచిన దేవా = నా తల్లి గర్భము నందే నను ప్రతిష్ఠ ||సృష్టి||
2.  శైశవ – బాల్య – యౌవ్వనములు- వైవాహిక -జీవితము నొసంగి = భార్యభర్తల బంధమును వేసి – భవ బంధములు గల -బిడ్డలను నొసగితివి – నీ కృపల దలచుచు -దానముగ ||సృష్టి||
3.  విద్యాబుద్దులు – బలసౌఖ్యములు – వద్య గొరియ పిల్ల రక్షణ మధ్యాకాశ – మార్గములు తెలిపి – ఈ వ్యర్ధలోకపు – వ్యర్థ జీవిత మార్గములు విడుచు – నీ కృపల దలచుచు ||సృష్టి||
4.  ప్రేమాను – రాగముల- సిలువ వృక్షము – నందు అంటు కట్టబడి వీరల్ = తుదకు ప్రేమ – బంధములతో బంధింపబడి నీలో బహుగ ఫలియించునటుల ||సృష్టి||
5.  మానవుని – ఆయుష్కాలంబు మాయమౌ ఆవిరివంటిదియౌ -మరుక్షణము – మటు మాయమౌ పోవు – మానవుని జీవం పరమపురమున – ప్రభుతో నుండుటకు నీ కృపలదలచుచు ॥సృష్టి||
6.  కష్టకాలములందు – కర్తగా – కాచి బ్రోచిన – కన్నతండ్రి నష్టములు కలిగినను – నిలిపితివి తోడునీడౌ – కాచిబ్రోచితివి నా బ్రతుకు బాటలో ॥సృష్టి||
7.  శేషకాలపు శ్రేష్టత లెరిగి స్వామి యేసుని సేవలు చేయను = అంకితంబు జేతు నా బ్రతుకు ప్రభు సేవ కొరకు కట్ట కడవరి – శ్వాస మట్టునకు ఆ కృపల దలచుచు ॥సృష్టి||