← కీర్తనలు

727. వివాహ వార్షిక దినము

రాగం: ముఖారి|తాళం: త్రిపుట|ఛాయ: యేసు నన్ను ప్రేమించినావు|రచయిత: బోండ్ల సైరన్

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
దేవా – దీవించుమా దంపతులన్ దయతో నీవు దీవించు మెల్లప్పుడు
1.  పెండ్లి అయినది – మొదలు పలు దీవెనలు – తోడ దీవించుచు -బ్రోచితివి – అటులే – ఈ వత్సరమునందు – ఆశీస్సు – లందించి ఆనందింపగ జేయుమయా || దేవా||
2.  సంసార యాత్రలో సంతాన ప్రాప్తిని సకల సంపద- లొసగితివి ఒసగి = సంతోష – సౌఖ్యముల కొసగుమయా సమకూర్చి సతతంబు స్వామి వీరల ముల || దేవా||
3.  సంకట స్థితులందు – భంగ – పాటులయందు బహు ధైర్య నిచ్చితివి = ఇచ్చి నీ బాహు బంధముల- బంధించి రక్షించి – భోగ భాగ్యము – లొసగితివి || దేవా||
4.  ప్రేమాను – రాగముల – సిలువ వృక్షము – నందు = తుదకు – ప్రేమ ఫలియించునటుల – అంటు కట్టబడి వీరల్ బంధములతో బంధింపబడి నీలో – బహుగ || దేవా||
5.  ఆత్మీయ – శరీర – ఆకలి దప్పుల యందు ఆదరణ తృప్తి నొసగి ఆత్మ శక్తితో నింపి – నడిపించు – నీ త్రోవన్ నిలిచి నివసింపగ జేయన్ || దేవా||
6.  ఇహలోక – పరలోక – ఈవులన్నియు నిచ్చి ఈ కవనున్ దీవించుము = కడకు – కడు దీవెనలు – బొండ- కుటుంబ సభ్యు లమై కృప జూపి -బ్రోవు మేస || దేవా||