726. జన్మదిన వార్షికము

రాగం: ముఖారి • తాళం: త్రిపుట • ఛాయ: ఉన్నపాటున వచ్చుచున్నాను • రచయిత: బోండ్ల సైరన్
పల్లవి:సన్నుతింతును దేవ నీ సన్నిధానమున – సన్నుతింపగ జాలను = సకల మేలులు – సర్వకృపలను – సిలువ విలువల- ప్రేమ నొసగి- కలుషములు కడుగంగ నాపై – కరుణజూపిన కరుణమూర్తి
1. గతకాలమందును కాని చేతల జేసి వెతలలో పడియుంటిని = స్థితిని మరచి – నాదు మనవులు – మరల అడుగుచుండగ – మదిని రోయని నాదు పాపము – కడిగి శుద్ధుని జేసినందుకు ॥నన్ను||
2. పిండాకృతిలో నుండ – దండినాధుడ – నాదు -గండములు – తొలగించితివి = బండవంటి బ్రతుకు బాటలో గుండె బరువులు దించి అండగ – ఉండి నాబ్రతు – కెండ కుండగ – జీవజల బుగ్గలను ద్రాగుచు ॥సన్ను॥
3. ఆయు – రారోగ్యములు – ఆనంద సౌఖ్యములు – అనుగ్రహించిన నా విభుడు = అనుక్షణంబు – అన్ని విధముల – ఆపదలు కలిగినను ద్రోలి అండ – దండగ ఉండి నన్ను- ఆదరించిన దేవ సుతులు ॥సన్ను॥
4. తల్లిదండ్రులు – అన్న – దమ్ములు – అక్కలు- చెల్లెండ్ర తో బుట్టువులన్ = యెల్ల విధముల – కృపలోసంగగ- ఉల్ల సింపగ – ఉర్వియందున యెల్లరికి సువార్త – జాటుచు – యెలమి సాక్షిక యిలను నిలుపగ ॥సన్ను॥
5. నూతన వత్సరమందు –నీతి మార్గము విడువక నీతి సూర్యుడ నడుపుమయా = రోతవంటి పాత బ్రతుకును పాత వత్సరమందు వదలి నీతి – న్యాయము- కరుణ – శాంతులు నూతననాబ్దిలో – నొసగు తండ్రి ॥సన్ను॥
6. జన్మనిచ్చిన తండ్రి – జన్మదినంబున – జననీ జనకుల గావుమయా జవము జీవము నవబలంబును పక్షిరాజున కొసగి నటులే = మేమతో హృదయమును – తృప్తితో నింపి బ్రోవుము నీతో బ్రతుకుచు ॥సన్ను॥