← కీర్తనలు

725. పెండ్లి ప్రధానం

రాగం: జంఝూటి|ఛాయ: మానవుల మేలు కొరకు|రచయిత: బోండ్ల సైరన్

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
మానితమౌ – కార్యములను మాన్యుడేసే – చేయును = మానుగ వివాహ స్థితిని – మహిని సంకల్పించెగ ॥మాని॥
1.  పెండ్లి – కార్యక్రమములలో- ప్రధానమే ప్రధానము = పెండ్లి – ఘనము అన్నిటను – పాన్పు నిష్కంళంకము ॥మాని॥
2.  రిబ్కా మరియ కన్నియలకు జరిగె ప్రధానంబులు = రమ్యముగను – జరుగుచుండె – నాటినుండి – నేటికి ॥మాని॥
3.  క్రీస్తు – వరుడు – సంఘ – వధువున్ – బెండ్లి యాడు పరమున = కల్వరందు – సంఘమునకు – ప్రధానంబు – జరిగెను॥మాని॥
4.  వెండి బంగారు నగలు- వెలగల వస్త్రంబులు = పెండ్లికూతురాదులకు వెసగనిత్తు – రీ దినం॥మాని॥
5.  తల్లికి – ముత్తవ్వలకు తగిన రీతి – ప్రేమతో = తప్పక వస్త్రములు – పెండ్లి కొడుకు – వారలిత్తురు ॥మాని॥
6.  తండ్రి సుత – పరిశుద్ధాత్మ – త్రియేక దేవ స్తోత్రముల్ తరగనట్టి దీవెనలను – తండ్రి వీరి – కొసగుమా ॥మాని॥