← కీర్తనలు

724. నిశ్చితార్థం

రాగం: ఆనందభైరవి|తాళం: కురుఝంపె|ఛాయ: కానాపురంబులో|రచయిత: బోండ్ల సైరన్

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
కళ్యాణ – శోభతో కలకాల ప్రేమతో -కరుణాంత – రంగుడు కరుణజూప కరుణాల వాలుని –కమనీయ – సేవలు – కలవరము లేకుండ చేయుమెపుడు –
1.  నిశ్చయ – తాంబుల మిచ్చి పుచ్చుకొనుట నిక్క మంచు – ప్రభువు – నిర్ణయించె = నిశ్చయించిన యేసు -నీడవలె వెంటాడి – నిరతంబు – తోడుగ నిలుచు – మీదో ॥కళ్యాణ॥
2.  సంసార – జీవితము – సంగీత కచ్చేరి – సరిగను – పదనిసల సాకీలతో = స్వరపేటికలు – రెండు – సప్తస్వరలొకటిగా సంసార – కచ్చేరి సాగునటుల ॥కళ్యాణ||
3.  అనుపల్లవి: శ్రుతు -పలుకు –లు కలిగించు – అష్టమ స్వరంబు అప్పుడప్పుడు నా స్వరంబు = అండగోరుము – యేసు దండి –పండిత – గురువు – గండములు – తొలగించు గాత్రములకు ॥కళ్యాణ॥
4.  మధురాను – భూతుల మధురిమల హృదివీణ మృదు మధుర -రాగాలు మీటునటుల = తీగ తెగిపోకుండ –తియ్యని అనురాగ – రాగములు – పాడగను రయము మీర ॥కళ్యాణ॥
5.  తీగ తెగిపోయిన – తీగసరిచేయుట – మీ తరము -కాదని – యెరిగి యెపుడు = తండ్రి సుత శుద్ధాత్మ – త్రియేక దేవుడు – సరిచేసి – దీవించు – ధన్యులనగ ॥కళ్యాణ||