← కీర్తనలు

723. యెహోవా నీ నామము

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
యెహోవా నీ నామము ఎంతో బలమైనది ఆ…ఆ…ఆ… ఎంతో బలమైనది యేసయ్య నీ నామము ఎంతో ఘనమైనది ఆ…ఆ…ఆ… ఎంతో ఘనమైనది || యెహోవా ||
1.  మోషే ప్రార్ధించగా మన్నాను కురిపించితివి (2) యెహోషువా ప్రార్ధించగా సూర్యచంద్రుల నాపితివి (2) || యెహోవా ||
2.  నీ ప్రజల పక్షముగా యుద్దములు చేసిన దేవా (2) అగ్నిలో పడవేసినా భయమేమి లేకుండిరి (2) || యెహోవా ||
3.  సింహాల బోనుకైనా సంతోషముగా వెళ్ళిరి (2) ప్రార్ధించిన వెంటనే రక్షించె నీ హస్తము (2) || యెహోవా ||
4.  చెరసాలలో వేసినా సంకెళ్ళు బిగియించినా (2) సంఘము ప్రార్ధించగా సంకెళ్ళు విడిపోయెను (2) || యెహోవా ||
5.  పౌలు సీలను బంధించి చెరసాలలో వేసినా (2) పాటలతో ప్రార్ధించగా చెరసాల బ్రద్దలాయే (2) ||యెహోవ||