← కీర్తనలు

722. యౌవనస్థుల భజన కీర్తనలు

ఛాయ: స్తోత్రము చేయరే - సోదరులారా|రచయిత: స.సా. సుబ్బయ్య

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
రమ్ము రమ్ము ఓ పరిశుద్దాత్మా – మమ్ముల మరువకను -ఇమ్మహిలో మా తోడు నీవు యని – హితముగ వేడుగను
1.  దోసిలొగ్గి నిను వేడుచుండగా యేసునామమునను నీ శుభములకై -కాచియుండకా – దాసుల మొర వినను
2.  శిరముల వంచి కరముల మోడ్చి మొదలు బెట్టగాను పరమ వరములను దుర దుర మాపై – గురిగింపు మికను –
3.  మోకరించు నిను వేడుచుండగా -మోదము చూపుచును – నీకే మ్రొక్కుచు బ్రతిమిలాడగా – ఏకమనస్సుతోను ॥
4.  యేసు నామమున లేచి నిలబడి- ఎంచుచు మేలులను – వాసిగ భజనలు చేసి నుతింతుము – నీ సహాయమునను
గానం సూచన
(వలయాకారముగా నిలువబడి అభినయము చేయుచు పాడవలెను)