← కీర్తనలు

716. మందార మకరంద మాధుర్యమున

రచయిత: ఆచార్య అర్. అర్. కె. మూర్తి

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
మందార మకరంద మాధుర్యమున దేలు మధుపమా నా హృదయ మా
1.  యేసు పదముల వ్రాలి అమృతధారను గ్రోలి- ఆనందమున తేలుమా (2) పరమ సింహాసనముపై కిగయుమా ॥మందార॥
2.  నిర్మల మందాకిని వీచికలో తూగు రాజహంసా నా మానసా హంసా యేసు వాక్య తరంగ, డోలిక పై వూగి హాయిగా విహరింపుమా – మోక్ష సంధాయకుని వరియించుమా ॥మందార॥
3.  లలిత రసాల పల్లవా – ఖాదియై వెలుగు కోయిలమ్మ – హృదయ విహంగమా యేసు తరు శాఖపై – ఏపుగా కూర్చుండి జీవ ఫలములన్ భజింపుమా – రక్షకుని ప్రేమ గీతి పాడుమా ॥మందార॥
4.  పూర్ణేందు చంద్రిక స్ఫురితమై వెలుగొందు చకోరమా నా జీవనా పతాకమా యేసు వెలుగులు చిందు – భాసురంబగు విందు పరమార్ధమునూ చూపెనే వెన్నెల – కరుణామృతము కురిసెనే ॥మందార॥