← కీర్తనలు

715. తంబుర వాద స్వరముల తోడ

రచయిత: ఆచార్య అర్. అర్. కె. మూర్తి

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
తంబుర నాద స్వరముల తోడ తగువిదిని నిను భజన చేతు (2) అంబురంబున కెగసే పాటలు (2 హాయిగ హాయిగ పాడెద పాడెద (2) ||తంబుర||
1.  సితార స్వరమండలములతో శ్రీకర నిను భజన చేతు (2) ప్రతి దినము నీ ప్రేమ గాదను (3) ప్రస్తుతించి పాడెద పాడెద (2) ||తంబుర||
2.  మృదంగ తాళ తకిట ద్వనులతో మృత్యుంజయ నిను భజన చేతు (2) ఉదయ సాయంత్రములా యందు (3) హొసన్నా యని పాడెద పాడెద (2) ||తంబుర||
3.  పిల్లన గ్రోవి చల్లగ నుండి ఉల్లమున నిన్ను భజన చేసెద (2) ఉల్లమున నిను ఎల్లవేలల (3) హల్లెలూయని పాడెద పాడెద (2)