పల్లవి: మొదటి విధానం
లెమ్ము తేజరిల్లుము నీకు
వెలుగు వచ్చియున్నది (2)
యెహోవా మహిమ నీపై (2)
ప్రకాశముగా నుదయించె (2) ||లెమ్ము||
1. యేసే యీ లోకమునకు
వెలుగై యున్నానని చెప్పెన్ (2)
యేసుని నమ్మువారు (2)
వెలుగులో నడుచువారు (2) ||లెమ్ము||
2. అంధకార మందుండి
బంధింప బడిన వారిన్ (2)
ఆశ్చర్యమైన వెలుగు (2)
నందించి విమోచించెన్ (2) ||లెమ్ము||
3. దాత ప్రభు యేసుని నమ్మి
నీతిగా నడుచువారు (2)
జాతి భేదములు లేక (2)
జ్యోతుల వలె నుందురు (2) ||లెమ్ము||
4. మనుజులు మీ సత్క్రియలను
జూచి బహు సంతోషించి (2)
మనసారా పరమ తండ్రిన్ (2)
మహిమ పరచెదరు (2) ||లెమ్ము||
5. జనములు నీ వెలుగునకు
పరుగెత్తి వచ్చెదరు (2)
రాజులు నీదు ఉదయ (2)
కాంతికి వచ్చెదరు (2) ||లెమ్ము||
పల్లవి: రెండవ విధానం
లెమ్ము తేజరిల్లుము నీకు
లెమ్ము తేజరిల్లుము నీకు
వెలుగు వచ్చియున్నది
యెహోవా మహిమ నీపై
ప్రకాశముగా నుదయించె ||లెమ్ము||
1. జనములు నీదు వెలుగునకు
పరుగెత్తి వచ్చెదరు
రాజులు నీదు ఉదయ
కాంతికి వచ్చెదరు ||లెమ్ము||
2. సముద్ర వ్యాపారము
నీవైపు త్రిప్పబడును
జనముల ఐశ్వర్యము
నీ యొద్దకు వచ్చును ||లెమ్ము||
3. దేవదారు సరళ గొంజి
చెట్లు నా ఆలయమునకు
తేబడును నాదు పాద
స్థలము మహిమ పరచెదను ||లెమ్ము||
4. నిన్ను శాశ్వతమైన
శోభాతిశయముగ జేతున్
బహుతరములకు సంతోష
కారణముగ జేసెదను ||లెమ్ము||
5. వారిలో ఒంటరియైన
వాడు పది వందలగును
ఎన్నిక లేనివాడు
బలమైనట్టి జనమగును ||లెమ్ము||
