← కీర్తనలు

703. యువజనులకు పిలుపు

ఛాయ: ఉదయామ్మాయెను|రచయిత: రెవ. కొంగర సామ్యేల్ సంజీవి

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
యువజనులంతా - యేసుని పేరిట - యేకము కావలెను భువిలో యేసుని -ప్రేమను జాటను - బూని కదలవలెను
1.  యేసే మాదిరి - యేసే రక్షకు - దేసే దేవుడని వాసిగ యేసుని జాడలో నడువగ నాశతో బూనుదము ||యువ||
2.  జేతుము - ప్రతి దినమును మన పరమ తండ్రి కిలలో సార్ధకముగ సహవాస తండ్రితో - సతతము జేయుదము ||యువ||
3.  దేవుని వాక్యము త్రోవకు వెలుగది - భావము మార్చునని జీవము నొందగ దినదినమున నొక భాగము జదువుదము ||యువ||
4.  సంఘము యేసుని శరీరమేయని - సేవకు బూనుదము సంఘపు క్షేమమే మదిలో నిడుకొని - సాయము జేయుదము ||యువ||
5.  సేవను జేసి సాక్ష్యము నిచ్చి- యేసుని జూపుదము యే విధముననో యేసుని యొద్దకు ఆత్మల నడుపుదము ||యువ||