← కీర్తనలు

700. దేవుడు లోకము నెంతో ప్రేమించెను

రచయిత: రెవ. కొంగర సామ్యేల్ సంజీవి

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
దానమిచ్చెను ధరణికి దేవుడు ప్రేమతో తన ప్రియ తనయున్ లోకమునెంతో ప్రేమించెన్ – కుమారునియందు విశ్వసించు వారిని రక్షింపగ నెంచి ॥దానమిచ్చెను॥
1.  దూతలు అరాతిరియందున ఖ్యాతిగా శుభవార్తదెల్పిరిబెత్లహేంపట్టణమందున ప్రభుయేసు బుట్టెను రక్షకుడాయన రయమున జూడుడి ||దానమిచ్చెను॥
2.  ప్రాణమియ్యను పాపులకొరకై -ప్రేమతో ప్రభుయేసు వచ్చెను దేవునిమహిమను విడిచి-మానవుడయ్యెను మనవంటి వాడుగా మహిలోనబుట్టెను ॥దాన॥
3.  చేర్చుకొను డీ మీ హృదయములన్- ప్రీతితో ప్రభు యేసు రక్షకుని పాపికి పరిహారము మరియు-పరిశుద్ధ జీవితం పరలోక ఆనందం-ప్రభుయేసుడిచ్చును దానమిచ్చెను॥
4.  హల్లెలూయ పాడుదాము దేవుని యమూల్య ప్రేమకై యేసు మన కిచ్చి నందుకై మన రక్షణ కొరకై హోసన్న పాడుదం ॥॥