పల్లవి:
యేసు నామమే పావనము – ప్రభు యేసే రక్షణ కారణము – మను జాళి పాపము తీరగా – మర ణాబ్ది తీరము చేరగా – శ్రీ యేసు మాకు దారిగదా
1. స్వామి యేసు మాలో – తన ప్రేమ నిలుపగా – యెన లేని ఈ విగా – తన మేను బలినిడ లేదా
||యేసు||
2. పాప ఘోర తాప – తతి బాపి కరుణతో – చెయి జాపి ప్రేమచే – తన ప్రాపు మనకిడ లేదా
॥యేసు॥
3. రక్త సిక్త బాట – మన ముక్తి పథముగా – అను రక్తిజూపగా – మన పాలి రక్షకుడాయెగదా
॥యేసు॥
4. చావు గెల్చి మాకు – తన జీవమొసగగా – మము కాయువాడుగా – ఘన దేవుడితడగు గాదా
||యేసు||
5. దారి కానరాని – కడు ఘోరవనములో – నడ యాడు వేళలో మము చేరబిలిచిన వాడుగదా
॥యేసు|
6. ఎన్నరాని రేడు - మము కన్న సుతులుగా - చే కొన్నవాడుగా తన పేరు మనకిడి లేదా
||యేసు||
7. నేడు యేసురాజు - మన తోడు నడువగా - కొని యాడి వేడుచు - దివి సీమ నిలుతుము వేగ
||యేసు||
