పల్లవి:
సీయోను పాటలు సంతోషముగా - పాడుచు సీయోను వెల్లుదము (2)
1. లోకాన శాశ్వతానందమేమియు - లేదని చెప్పెను ప్రియుడేసు (2)
పొందవలె నీ లోకమునందు - కొంతకాలమెన్నో శ్రమలు (2) ||సీయోను||
2. ఐగుప్తును విడచినట్టి మీరు - అరణ్యవాసులే ఈ ధరలో (2)
నిత్యనివాసము లేదిలలోన - నేత్రాలు కానానుపై నిల్పుడి (2) ||సీయోను||
3. మారాను పోలిన చేదైన స్థలముల - ద్వారా పోవలసియున్ననేమి (2)
నీ రక్షకుండగు యేసే నడుపును - మారని తనదు మాట నమ్ము (2) ||సీయోను||
4. ఐగుప్తు ఆశలనన్నియు విడిచి - రంగుగ యేసుని వెంబడించి (2)
పాడైన కోరహు పాపంబుమాని - విధేయులై విరాజిల్లుడి (2) ||సీయోను||
5. ఆనందమయ పరలోకంబు మనది - అక్కడనుండి వచ్చునేసు (2)
సీయోను గీతము సొంపుగ కలసి - పాడెదము ప్రభుయేసుకు జై (2) ||సీయోను||
