← కీర్తనలు

691. అందరిలో అతిశ్రేష్ఠుడు!

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
సాగిలపడి మ్రొక్కెదము సత్యముతో ఆత్మలో మన ప్రభు యేసుని ఆ ... ఆ ... ఆ ...ఆ ... (2) ||సాగిలపడి||
1.  మోషేకంటే శ్రేష్టుడు - అన్ని మోసములనుండి విడిపించున్ (2) వేషధారులను ద్వేషించున్ - ఆశతో మ్రొక్కెదము (2) ||సాగిలపడి||
2.  అహరోనుకంటే శ్రేష్టుడు - మన ఆరాధనకు పాత్రుండు (2) ఆయనే ప్రధాన యాజకుడు - అందరము మ్రొక్కెదము (2) ||సాగిలపడి||
3.  ఆలయముకన్న శ్రేష్టుడు - నిజ ఆలయముగ తానే యుండెన్ (2) ఆలయము మీరేయనెను - ఎల్లకాలము మ్రొక్కెదము (2) ||సాగిలపడి||
4.  యోనా కంటె శ్రేష్టుడు - ప్రాణ దానముగా తన్ను అర్పించెన్ (2) మానవులను విమోచించెన్ - ఘనపరచి మ్రొక్కెదము (2) ||సాగిలపడి||
5.  సొలోమోను కన్న శ్రేష్ఠుడు - సర్వజ్ఞానమునకు ఆధారుండు (2) పదివేలలో అతిప్రియుండు - పదిలముగ మ్రొక్కెదము (2) ||సాగిలపడి||
6.  రాజులకంటే శ్రేష్ఠుడు - యాజకులనుగా మనలను చేసెన్ (2) రారాజుగ త్వరలో వచ్చున్ - రయముగను మ్రొక్కెదము (2) ||సాగిలపడి||
7.  అందరిలో అతి శ్రేష్ఠుడు - మనకందరికి తానే ప్రభువు (2) హల్లెలూయకు పాత్రుండు - అనుదినము మ్రొక్కెదము (2) ||సాగిలపడి||