కీర్తనలు

689. సర్వకృపానిధియగు ప్రభువు!

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
సర్వకృపానిధియగు ప్రభువా - సకల చరాచర సంతోషమా స్తోత్రము చేసి స్తుతించెదను - సంతసముగ నిను పొగడెదను హల్లెలూయా హల్లెలూయా… హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా యని పాడెదను ఆనందముతో సాగెదను
1.  ప్రేమించి నన్ను వెదకితివి - ప్రీతితో నను రక్షించితివి పరిశుద్ధముగా జీవించుటకై - పాపిని నను కరుణించితివి ||సర్వ||
2.  అల్పకాల శ్రమలనుభవింప - అనుదినము కృపనిచ్చితివి నాథుని అడుగుజాడలలో - నడుచుటకు నను పిలిచితివి ||సర్వ||
3.  మరణ శరీరము మర్పునొంది - మహిమ శరీరము పొందుటకై మహిమాత్మతో నను నింపితివి - మరణ భయములను తీర్చితివి ||సర్వ||
4.  భువినుండి శ్రేష్ట ఫలముగను - దేవునికి నిత్య స్వాస్థ్యముగా భూజనములలోనుండి నన్ను - ప్రేమించి క్రయ ధనమిచ్చితివి ||సర్వ||
5.  ఎవరూ పాడని గీతములు - యేసుతో నేను పాడుటకై హేతువు లేకయే ప్రేమించెన్‌ - యేసుకు నేనేమివ్వగలన్‌ ||సర్వ||