పల్లవి:
వెండి బంగారములకన్న - యేసుని కలిగి యుండెదము
వెలగల భూషణములకన్న - కల్వరి సిల్వ ధరించెదము
1. అడవిరాజు తన పిల్లలను - లేమికలిగి ఆకలిగొనును
దేవుని ఆశ్రిత జనులకు ఎపుడు - మేలులు కొదువై యుండవుగా ||వెండి||
2. మన ప్రభుండు మహదేవుండు - ఘన మహాత్యము గలరాజు
రక్షణకర్త ప్రధాన కాపరి - ఆయన మేపెడి గొర్రెలము ||వెండి||
3. వారి గుర్రములు రధములను - బట్టి జనులు గర్వించెదరు
మనమైతే మనదేవుని నీతి - న్యాయములను శ్లాఘించెదము ||వెండి||
