← కీర్తనలు

687. సమాధిపై ప్రభువు విజయము!

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
లేచినాడురా సమాధి గెలిచినాడురా యేసు యేసు లేచినాడురా సమాధి గెలచినాడురా లేతునని తాఁజెప్పినట్లు - లేఖనములో పలికినట్లు ||లేచి||
1.  భద్రముగ సమాధిపైన - పెద్దరాతిని యుంచిరి భటులు ముద్రవేసి రాత్రియంత నిద్ర లేక కావలియున్న ||లేచి||
2.  ప్రభువు దూత పరము నుండి - త్వరగ దిగి రాతిని దొర్లించి భళిర దానిపై గూర్చుండె భయము నొంద కావలి వారు ||లేచి||
3.  ప్రొద్దు పొడవకముందె స్త్రీలు సిద్ధపరచిన సుగంధములు శ్రద్ధతోడ తెచ్చి యేసుకు - రుద్దుదామని వచ్చిచూడ ||లేచి||
4.  చూడ వెళ్ళిన స్త్రీలను దూత - చూచి యిపుడు వారి తోడ లేడు గలిలయ ముందుగా పోతున్నాడు - అప్పుడే లేచినాడనె ||లేచి||
5.  చచ్చిపోయి లేచినాడు - స్వామి భక్తుల కగుపడినాడు చచ్చినను నను లేపుతాడు - చావు అంటే భయపడరాదు ||లేచి||
6.  నేను చేసే పనుల నెరుగు - నేను నడిచే మార్గ మెరుగు నేను జెప్పిన మాట లెరుగు - నేను బ్రతికే బ్రతుకు నెరుగు ||లేచి||
7.  నేను లేచిన యేసునందు - మానకను మది నమ్ముకొందు తాను నాలో నుండి నందున - దయను జేర్చును మోక్షమందు ||లేచి||
8.  పాప భారము లేదు మనకు - మరణ భయము లేదు మనకు నరక బాధ లేదు మనకు - పరమ తండ్రి యేసు ప్రభువు ||లేచి||
9.  యేసునందే రక్షణ భాగ్యం - యేసునందే నిత్య జీవం యేసునందే ఆత్మ శాంతి - యేసునందే మోక్ష భాగ్యం ||లేచి||
10.  పాపులకై వచ్చినాడు - పాపులను కరుణించినాడు పాపులను ప్రేమించినాడు - ప్రాణ దానము చేసినాడు ||లేచి||