← కీర్తనలు

683. రమ్మనుచున్నాడు యేసురాజు!

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
రమ్మనుచున్నా డేసురాజు రండి సర్వ జనులారా
1.  ఇల్లువాకిలి లేనివారలు ఇహాన నమ్మదగనివారలు తన రాజ్యము మీకిచ్చును యేసు
2.  కరవుచే కృశించుచున్న మరణించుచున్న ప్రజలారా ఆకలిదప్పులు తీర్చును మీకు రండి సర్వజనులారా ||రమ్మను||
3.  ముండ్ల మకుటము ప్రక్కన గాయము పాదహస్తములలో గాయములు పొందిన ప్రభువే పిల్చెను మిమ్ము రండి సర్వజనులారా ||రమ్మను||
4.  రయమున ప్రియులారా కూడి రండి పరీక్ష చేయండి భరించును మీ భారములన్నియు రండి సర్వజనులారా ||రమ్మను||