కీర్తనలు

684. రమ్ము, నీ తరుణమిదే!

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
రమ్ము! నీ తరుణమిదే పిలచుచున్నాడు నీ ప్రభువైన యేసు నొద్దకు
1.  జీవితమంతయు వ్యర్థముగను దుఃఖముతోను గడుపుటయేల వచ్చి ఆయన శరణు జొచ్చినచో వాంఛతో నిన్ను స్వీకరించున్ ||రమ్ము||
2.  కట్టిన యిల్లు ధనధాన్యములు కనబడు బంధుమిత్రులును గూడు విడిచి నీవు పోయినచో వెంటనీతో రారెవరు ||రమ్ము||
3.  అందము మాయ అస్థిరమే దాని నమ్మకుము మోసగించును మరణము ఒకనాడు వచ్చును మరువకు నీ ప్రభువును ||రమ్ము||
4.  మిన్ను క్రిందన్ భూమి మీదన్ మిత్రుడేసు నామముగాక రక్షణ పొందు దారిలేదు రక్షకుడేసే మార్గము ||రమ్ము||
5.  తీరని పాపవ్యాధులను మారని నీదు బలహీనతల్ ఘోర సిలువలో మోసితీర్చెన్ గాయములచే బాగుపడన్ ||రమ్ము||
6.  సత్యవాక్కును నమ్మి రమ్ము నిత్యజీవమును నీకిచ్చున్ నీ పేరు జీవపుస్తకమునందు నిజముగ ఈనాడే వ్రాయున్ ||రమ్ము||