← కీర్తనలు

682. యెహోవా మార్గము యథార్థమైనది!

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
యెహోవా నా బలమా యధార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం ||యెహోవా||
1.  నా శత్రువులు నను చుట్టినను నరకపు పాశములరికట్టినను వరదవలె భక్తిహీనులు పొర్లిన వదలక నను ఎడబాయని దేవా ||యెహోవా||
2.  మరణపు టురువులు మరువక మొరలిడ ఉన్నతదుర్గమై రక్షణ శృంగమై తన ఆలయములో నా మొరవినెను అదిరెను ధరణి భయకంపముచే ||యెహోవా||
3.  నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగ జేయున్ జలరాసులనుండి బలమైన చేతితో వెలుపల జేర్చిన బలమైన దేవుడు ||యెహోవా||
4.  పౌరుషము గల ప్రభు కోపింపగ పర్వతముల పునాదులు వణకెను తన నోటి నుండి వచ్చిన అగ్ని దహించివేసెను వైరుల నెల్లను ||యెహోవా||
5.  మేఘములపై ఆయన వచ్చును మేఘములను తన మాటుగ జేయును ఉరుముల మెరుపుల మెండుగ జేసి అపజయమిచ్చును అపవాదికిని ||యెహోవా||
6.  దయగలవారిపై దయచూపించును కఠినుల యెడల వికటము జూపును గర్విష్ఠుల యొక్క గర్వము నణచును సర్వము నెరిగిన సర్వాధికారి ||యెహోవా||
7.  నా కాళ్ళను లేడికాళ్ళగ జేయును యెత్తైన స్థలములో శక్తితో నిలిపి రక్షణ కేడెము నాకందించి అక్షయముగ తన పక్షము జేర్చిన ||యెహోవా||
8.  యెహోవా జీవము గల దేవా బహుగ స్తుతులకు అర్హుడ నీవు అన్యజనులలో ధన్యతజూపుచు హల్లెలూయా స్తుతిగానము జేసెద ||యెహోవా||