పల్లవి:
ప్రియయేసు నిర్మించితివి ప్రియమార నా హృదయం ముదమార వసించునా హృదయాంతరంగమున
1. నీ రక్త ప్రభావమున నా రోత హృదయంబును పవిత్రపరచుము తండ్రీ ప్రతిపాపమును కడిగి ||ప్రియ||
2. అజాగరూకుడనైతి నిజాశ్రయమువిడిచి కరుణారసముతో నాకై కనిపెట్టితివి తండ్రి ||ప్రియ||
3. వికసించె విశ్వాసంబు వాక్యంబును చదువగనె చేరితి నీదుదారి కోరి నడిపించుము ||ప్రియ||
