పల్లవి:
ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు? ఆ-ఆ-ఆ ప్రేమయెతానై నిలచి ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి ప్రేమనగరికి చనియె ||ప్రేమా||
1. నిశ్చలమైన ప్రేమజీవికి యిలలో తావేది ప్రేమ ద్రోహులేగాని ప్రియమున చేరరు వాని చేరిన చెలికాడగురా సమయమిదే పరుగిడరా ||ప్రేమా||
2. ఎంత ఘోరపాపాత్ములనైన ప్రేమించునురారా పాపభారముతో రారా పాదములపై బడరా పాపుల రక్షకుడేసు తప్పక నిను రక్షించున్ ||ప్రేమా||
3. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసెదవేల? రక్షణ దిన మిదియేరా తక్షణమే కనుగొనరా ఇదియే దేవుని వరము ముదమారగ జేకొనుము ||ప్రేమా||
