కీర్తనలు

679. ప్రభువు లేకుంటే అంతా శూన్యము

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
మణులు మాణిక్యములున్నా మేడమిద్దెలు ఎన్నున్నా మదిలో యేసులేకున్నా ఏది ఉన్నా అది సున్నా ||మణు||
1.  చదువులెన్నో చదివివున్నా పదవులెన్నో చేస్తున్నా విద్యవున్నా బుద్ధివున్నా జ్ఞానమున్నా అది సున్నా ||మణు||
2.  అందచందా లెన్నున్నా అండములపై కూర్చున్నా సుందరుడు ప్రభులేక యున్నా అందమున్నా అది సున్నా ||మణు||
3.  రాజ్యములు రమణులు ఉన్నా శౌర్యములు వీర్యము లున్నా బలము ఉన్నా బలగమున్నా ఎన్నివున్నా అవి సున్నా ||మణు||
4.  పూజ్యుడా పుణ్యాత్ముండా పుణ్యకార్య సిద్ధుడా దానధర్మము జపము తపము యేసులేనిది అదిసున్నా ||మణు||