కీర్తనలు

672. పాడెద దేవా, నీ కృపలన్ ...

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
పాడెద దేవ నీ కృపలన్ నూతన గీతములన్ స్తోత్రము చెల్లింతున్(2) ఆ..ఆ..ఆ...(2)
1.  భూమి పునాదులు వేయకముందే యేసులో చేసితివి ప్రేమ పునాదులు వేసితివి బ్రోచితివి ఈ దీనుని బ్రోచితివి ||పా||
2.  ప్రవిమల రక్తము కలువరి సిలువలో కలునకు నిచ్చితివి ప్రేమకృప మహదైశ్వర్యములతో పాపము తుడిచితివి నా పాపము తుడిచితివి ||పా||
3.  పాపము శాపము నరకపు వేదన మరి తొలగించితివి అపరాధములచే చచ్చిన నన్ను థర బ్రతికించితివి నన్ను బ్రతికించితివి ||పా||
4.  దేవుని రాజ్యపు వారసుడనుగా క్రీస్తులో చేసితివి చీకటి రాజ్యపు శక్తుల నుండి నను విడిపించితివి చెరవిడిపించితివి ||పా||
5.  ముద్రించితివి శుద్ధాత్మతో నను భద్రము చేసితివి సత్యస్వరూపి నిత్యనివాసి సొత్తుగా చేసితివి నీ సొత్తుగా చేసితివి ||పా||
6.  అన్యుడనై నిన్ను ఎరుగక యున్నను ధన్యుని చేసితివి ప్రియ పట్టణ పౌరుల సేవింపను వరముల నొసగితివి కృప వరముల నొసగితివి ||పా||