← కీర్తనలు

673. నిజ రక్షకుని కనుగొనుడి!

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
ప్రజలమే వేగమె రారె నిజదైవమును కనుగొనరె||
1.  పాపాత్ములనబడు వారి భారంబు దీయనుగోరి ప్రభుయేసు జూపినదారి పరమందు సుఖమిడుదారి ||ప్రజ||
2.  ఏ జాతివారలనైనన్ యే దేశవాసులనైనన్ యేమైన బేధము లేక యేసయ్య బ్రోచునువేగ ||ప్రజ||
3.  పాపాత్ములే తన సుతులు ప్రభు యేసునికి స్నేహితులు నీ పాపమెల్లను బోయెన్ నీకింక మోక్షము కలుగున్ ||ప్రజ||
4.  ప్రయాసపడి భారమును మోసెడు ఓ ప్రజలారా ప్రభుయేసుక్రీస్తే మీకు విశ్రాంతి నిచ్చునురండి ||ప్రజ||
5.  యేసయ్యగాకను వేరే యెవరైన లేరిక రారే దోషంబులలెల్నను బాపి ఆశీర్వదించునుగాచి ||ప్రజ||