పల్లవి:
యేసు చాలును యేసు చాలును యే సమయమైన యే స్థితికైన నా జీవితములో యేసు చాలును
1. పరమజీవము నాకు నివ్వ తిరిగి లేచెను నాతో నుండ నిరంతరము నన్ను నడిపించును మరల వచ్చి యేసు కొని పోవును ||యేసు||
2. సాతాను శోధనలధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళెదను ||యేసు||
3. పచ్చిక బయలులో పరుండజేయున్ శాంతి జలము చెంత నడిపించును అనిశము ప్రాణము తృప్తిపరచున్ మరణ లోయలో నన్ను కాపాడును ||యేసు||
4. నరులెల్లరు నన్ను విడిచినను శరీరము కుళ్లి కృశించినను హరించినన్ నా ఐశ్వర్యము విరోధివలె నన్ను విడచినను ||యేసు||
